-ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పెమ్మసాని
‘నీతి నిజాయితీ స్వచ్ఛతకు ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. 40 ఏళ్ల టిడిపి ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించి నిలబడిందంటే కార్యకర్తలు, నాయకులే కారణం.’ అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
గుంటూరులోని 39 వ డివిజన్, మారుతీ నగర్ లో టిడిపి సీనియర్ కార్యకర్త సింగిశెట్టి వీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం టిడిపి జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో పెమ్మసాని మాట్లాడుతూ… కార్యకర్తలను ఆదుకోవడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామన్నారు. స్థానికంగా రోడ్లు, డ్రైన్లు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, కార్పొరేషన్ కమిషనర్ తో మాట్లాడి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని వివరించారు. వైసీపీ కార్పొరేటర్ లను కూడా కలుపుకుంటూ వెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, మహమ్మద్ నశీర్ అహ్మద్, టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, మాజీ కార్పొరేటర్ ముత్తినేని రాజేష్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని తదితరులు పాల్గొన్నారు.