తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పార్థసారధి

తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలపై అలుపెరగక పోరాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేయుచున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ కి తిరుమల ఏడు కొండల స్వామి ఆశీస్సులు అండదండలు ఉండాలని కోరుకున్నా నని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలోని అల్పాదాయ వర్గాలకు చెందిన పేద ప్రజలకు, అలాగే జర్నలిస్టులకు కూడా తక్కువ ధరతో ఇల్లు అందించాలని సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

టిడ్కో ఇల్లు, పిఎంఎవై కింద పురోగతిలో ఉన్న ఇల్లు, పెండింగ్ ఇళ్ళ నిర్మాణాలను ఒక ప్రణాళిక బద్ధంగా లక్ష్యాలను నిర్దేశించుకుని ఒక సంవత్సరం లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేసేలా ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు లక్ష్య సాధన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వేకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.