శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో హుండీ చోరీ

గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు
సీసీ కెమెరాలు పర్యవేక్షణ లోపం

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రాత్రి హుండీ చోరీ జరిగింది.గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు జరిగాయి,సీసీ కెమెరాలు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. గత నెలలోనే ఆలయ హుండీ లెక్కింపు జరిగిందని అన్నారు.సుమారు 5000 నుండి 7000 రూపాయల వరకు ఉండొచ్చని ఆలయ సిబ్బంది తెలిపారు.స్థానిక పాకాల పోలీసులు సంఘటనానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు