అమరావతి: ఇంటింటికీ రేషన్ బియ్యం పథకం రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలవడంతో అక్కడికి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్లలేరా అనే చర్చ కూడా జరిగింది.
అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా కూడా జరిగిందని ప్రభుత్వం దృష్టికి నాదెండ్ల మనోహర్ తీసుకొచ్చారు. దీంతో ఇంటింటికీ పథకం రద్దు చేసి వాహనాలను, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.