స్వాతంత్య్ర దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

– నగర కమిషనర్‌ హరికృష్ణ

గుంటూరు, మహానాడు: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరపడానికి తగిన చర్యలు తీసుకోవాలని, జిల్లా వేడుకల్లో ప్రదర్శించే శకటం నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అద్దం పట్టేలా ఉండాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల కాన్సెప్ట్ ఉండాలని ఆదేశించారు.

స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణపై గురువారం అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జిఎంసి ప్రధాన కార్యాలయం, ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా జిల్లా స్థాయి వేడుకల్లో గుంటూరు నగరపాలక సంస్థ తరుపున ప్రదర్శించే శకటం నగరంలోని అభివృద్ధి పనులకు అద్దం పట్టేలా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునఃప్రారంభం చేయనున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటిన్ కాన్సెప్ట్ తో శకటం సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే నగరంలో 7 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి విభాగాల వారీగా అధికారులకు విధులు కేటాయిస్తామని, అందుకు తగిన విధంగా వేడుకల విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.