– అధికారులకు నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదేశం
– రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
నెల్లూరు నెక్లెస్ రోడ్డు ను తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసిందని.. నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నుడా అధికారులతో ఆయన సమావేశమయ్యారు.. టిడిపి హయాంలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు.. బుద్ధుడు, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని అవి మరమ్మతులకు గురయ్యాయని వెల్లడించారు.. వాటికీ మరమ్మత్తులు చేసి.. సుందరంగా తయారు చెయ్యాలని సూచించారు.
పర్యాటక కేంద్రంగా దీన్ని మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పడవల కృష్ణ మూర్తి గడవరపు నాని, మురల్లి,టిడిపి నేతలు పాల్గొన్నారు