విద్యాభివృద్ధితోనే ఉత్తమ సమాజం!

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: విద్యాభివృద్ధితోనే మన సమాజ అభివృద్ధి సాధ్యం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. విద్యార్థులు చదువులు పట్ల శ్రద్ధ వహించి భవిష్యత్తు తరాలకు వారథులుగా నిలవాలని కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని ఆర్థికంగా సామాజికంగా దేశాభివృద్ధిలో విద్యార్థి కీలకపాత్ర పోషించాలని కోరారు. దర్శి నియోజకవర్గం, దొనకొండ మండలం, కొచ్చర్లకోట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులతో ముచ్చటించారు. వారి బాగోగులు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునిస్తుందని తెలిపారు. విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ విద్యార్థులు చక్కటి వాతావరణం లో విద్యను అభ్యసించేందుకు అవసరమైన వస్తువులను సమకూరుస్తున్నారని వివరించారు. విద్య అభివృద్ధికి ప్రభుత్వ సహకారాన్ని అందుకొని మీరంతా చక్కగా చదువుకొని భావితరాల భవిష్యత్తుకు తోడ్పాటు ఇవ్వాలని డాక్టర్ లక్ష్మీ సూచించారు.