ఢిల్లీ : నజాఫ్‌గఢ్ లో తొమ్మిదో తరగతి చదివే ఓ అబ్బాయి అదే క్లాస్ చదివే తన స్నేహితురాలికి ఐ ఫోన్ గిఫ్ట్ ఇద్దామని, తన ఇంట్లోనే అమ్మ బంగారాన్ని దొంగతనం చేశాడు. ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన రూ. 50 వేలతో ఐ ఫోన్ కొని స్నేహితురాలికి గిప్ట్‌గా ఇచ్చాడు. బంగారం దొంగతనం జరిగిందని వాళ్ల అమ్మ ఫిర్యాదు చేస్తే పోలీసులు సీసీటీవీ పరిశీలించారు. దొంగతనానికి బయటి వ్యక్తులు ఎవరు రాలేదని నిర్ధారించుకున్న పోలీసులు కొడుకును ప్రశ్నించగా చేసిన తప్పును అంగీకరించాడు.