సీనియర్ ఐపీఎస్ అధికారులకు, అదనపు డీజీలకు ప్రమోషన్లు

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు, అదనపు డీజీలకు ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ డీజీగా శివధర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, డీజీ కేడర్‌లో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి, సీఐడీ డీజీగా షికా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్ పదోన్నతలు పొందిన వారిలో ఉన్నారు.