గిరిజన సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌

అమరావతి, మహానాడు: అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గిరిజన సోదరులకు నా శుభాకాంక్షలు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటి. అందుకే నాటి తెలుగుదేశం హయాంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించాం. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం ప్రోత్సాహాన్ని అందించాం.

గిరిజన జాతులను కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్నతంగా నిలబెట్టడమే. రాబోయే రోజుల్లో కూడా గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్ ను అందిస్తామని తెలియజేస్తున్నాను.
– నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి.

ఆదివాసీలు ఏమీ ఆశించరు…
స్వచ్ఛమైన మనసులు… ప్రకృతిని ప్రేమించే మనుషులు. సమాజానికి ప్రకృతి సంపద పంచడమే తప్ప తిరిగి ఏమీ ఆశించని ఆదివాసీలు వ్యక్తిత్వం నిత్యస్ఫూర్తి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు.
-నారా లోకేష్, విద్య, ఐటి శాఖ మంత్రి.