కిడ్నాప్ ను ఛేదించిన పోలీసులు

వినుకొండ, మహానాడు: వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద గురువారం ఉదయం కిడ్నాప్ గురైన ఒంటేరు నాగరాజుని పోలీసులు క్షేమంగా పట్టుకున్నారు. మర్రిపాలెం వద్ద గాయాలతో ఉన్న నాగరాజుని పోలీసులు గుర్తించి బాధితున్ని బండ్లమోటు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు బాధితుని విచారించి, వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాగరాజుని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు.