ఇప్పుడు మన దేశానికి మరింత భద్రత అత్యవసరం

అదేదో సినిమాలో నూతన ప్రసాద్ అన్నట్లు ..”భారత దేశం నేడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.లెఫ్ట్ నుండి పాకిస్తాన్ రైట్ నుండి బంగ్లాదేశ్ పైనుండి చైనా ప్రక్కనున్న రష్యా మన దేశాన్ని నాసినం చేయాలని చూస్తోంది” అంటాడు ..అట్లనే ప్రక్క దేశాల్లో మెదలైన చిచ్చు మన దేశానికి తాకుతున్న వెచ్చదనాన్ని వెంటనే ఆర్పకుంటే అది దావానలంగా మారి కారు చిచ్చు అయ్యే ప్రమాదం లేకపోలేదు…ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోన్నే ప్రతి ఒక్కరూ సంఘటితమై పార్టీలకు , ప్రాంతాలకు , మత విశ్వాసాలకు అతీతంగా విభేదాలు వీడి అందరూ కలిసి కట్టుగా ఒక్కటై భారతమాత కు పటిష్టమైన భద్రత కల్పించాలి .

కట్టు దిట్టమైన భద్రత కల్గిన ఒక దేశాన్ని పాలించే ప్రధాని ఇంట్లోకెళ్లి విచ్చల విడిగా ప్రవర్తించి, ఆ నాయకురాలు దిక్కు మొక్కు లేకుండా దేశం విడిచి పారిపోయి , తల దాచుకోవడానికి ఎక్కడో, ఎవర్నో ఆశ్రయించాల్సిన దుస్థితి కలిగిందంటే , అంత కన్నా దారుణమైన రాజకీయ వ్యవస్థ ఎక్కడన్నా ఉంటుందా…?! కారణాలు, పాలన లోపాలు, ఫాలసీ విధానాలు ఏమైనా కావచ్చు. ఇలాంటి సంఘటనలు విఫలమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం.

ఇది ప్రతి దేశానికి గుణపాఠం. గత రెండు మూడేళ్లుగా వివిధ దేశాల మధ్య శాంతి సామరస్యాలు కోల్పోయి దారుణ మైన యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనల ప్రభావం కొన్ని అగ్ర రాజ్జ్యాల ఆధిపత్య ధోరణి చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే దాపరిస్తే మన భారత దేశం పై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని దేశాలతో మనకున్న సతసంబంధాలు, ఆర్థిక వ్యాపార ఓప్పందాల పై ఎంతో నష్టం వాటిల్లుతుంది.

అందుకే యావత్తు భారత జాతి ఒక్కటై నిలవాలి. కేంద్ర ప్రభుత్వమే కాకుండా ప్రతి రాష్ట్రం ఎంతో జాగురతతో మెలుగుతూ, నూతన వ్యక్తుల కదలికలను , ఇలాంటి అవకాశాల కోసం ఎదురు చూసే అంతర్గత శక్తుల కుయుక్తులను, కుట్రలను భగ్నం చేశేలా మన సాయుధ భద్రతా దళాలు, గూడాచారి వ్యవస్థలు,రాజకీయ నాయకులు , సంఘ సంస్కర్తలు, ప్రజా కవులు,ఆధ్యాత్మిక ప్రభోధకులు, మేధావులు,మీడియా , వ్యాపారులు, ముఖ్యంగా దేశానికి బలమైన భావి భారత పౌరులు నేటి విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరూ గట్టిగా నిలబడి ఎంతో చాకచక్యంతో వ్యవహరించాలి.

దుష్ట శక్తుల స్వార్థ పూరిత కుటిల ప్రసంగాలకు ,వ్యాసాలకు ప్రభావితులై విచక్షణ కోల్పోయి ఉద్రేకాలు ఉప్పొంగి మన ఇంటిని మనమే ధ్వంసం చేసుకునే లా మన ఒంటిని మనమే కాల్చకునెలా ప్రవర్తించ కూడదు. యావత్ భారత దేశం 78వ స్వాతంత్ర వేడుకలు జరుపుకునే ఈ తరుణంలో మన పొరుగు దేశాల్లో జరుగుతున్న దారుణ మారణ కాండ నుండి మనం మన దేశం ఎంతో సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలి.

గంతలో ఎన్నెన్నో ఆటు పోట్లను, ఆర్థిక మద్యాన్ని మన పాలకుల ప్రతిభా కౌశలంతో ఎంతో సమర్థ వంతంగా ఎదుర్కొని దైర్యంగా చేదించి ముందుకు సాగాము. ఇప్పుడిప్పుడే మన దేశం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ ప్రపంచానికే గురుస్థానంగా గుర్తించి గౌరవించ బడుతున ఈ సమయంలో మన అఖండ భారతావనికి మనమంతా వెన్ను దన్నుగా నిలవాలి.

మనం బాగుండాలి అంటే మన ప్రక్కనున్న వాళ్ళు మరింత బాగుండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాము..”దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుష్యులోయ్” అన్న గురజాడ మాటల్ని మరువకుండా. ముందుకెళదాం. పంద్రా ఆగష్టు నాడు ఇంటింటా విజయ పతాకాన్ని ఎగర వేద్దాం.

సురేష్ కశ్యప్,
సీనియర్ జర్నలిస్ట్.