– ఎస్పీకి దువ్వాడ దరఖాస్తు
టెక్కలి, మహానాడు: నా దగ్గర తుపాకీ ఉంది. దానికి లైసెన్స్ ఇవ్వండి… అని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు.
అసలు లైసెన్స్ లేకుండా గన్ కలిగి ఉండటం… The Arms Act 1959 ప్రకారం నేరం కాదా….? ఇక అసలు విషయంలోకి వెళ్తే… ఎస్పీ మహేందర్ రెడ్డికి ఈనెల ఏడోతేదీన దువ్వాడ దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కొంత మంది తన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు. ఇదే విషయమై జులైలో కూడా టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.