టీడీపీ ప్రముఖులతో గొట్టిపాటి లక్ష్మి భేటీ

దర్శి, మహానాడు: దర్శి లోని వివాహ కార్యక్రమానికి విచ్చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ కడియాల లలిత్ సాగర్, డాక్టర్‌ కడియాల వెంకటేశ్వర రావును వారి స్వగృహంలో ప్రకాశం జిల్లా టీడీపీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసరెడ్డి(ఒంగోలు ఎంపీ), బీఎన్‌ విజయ్ కుమార్(ఎమ్మెల్యే, సంతనూతలపాడు, తెనాలి), శ్రవణ్ కుమార్(ఎమ్మెల్యే, తాటికొండ), డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి(ఎమ్మెల్యే, కనిగిరి), ఎలూరి సాంబశివరావు(ఎమ్మెల్యే, పర్చూరు), దామచర్ల సత్య(రాష్ట్ర టీడీపీ నేత), తదితరులు ఉన్నారు.