వైసీపీ పాలనలో నిర్మాణరంగం కుదేలు!

– రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి

ప్రకాశం, మహానాడు: వైసీపీ పాలనలో నిర్మాణరంగం కుదేలైందని, జగన్ ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామంలో సోమవారం వడ్డెర ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను సైతం దారి మళ్లించిన ఘనుడు జగన్ రెడ్డి. మేం అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచిత ఇసుక పాలసీ తెచ్చాం.

పేదల ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇస్తాం. టిడిపి హయాంలో భవన నిర్మాణ కార్మికులకు అందించిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య, కొండపి నియోజకవర్గ టిడిపి నేతలు, పలువురు వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.