నవ్విపోదురుగాక!

-వైసీపీ టీమ్ కు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య చురక

విజయవాడ : అంబేద్కర్ విగ్రహాం వద్ద ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే తాటికాయంత అక్షరాల పేరును తొలగించిన సంఘటనపై వైకాపా నాయకుల బృందం ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళటం నవ్విపోదురుగాక! నాకేటి సిగ్గు …. అన్నట్లుగా ఉందని, ఇలాంటి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే చర్యల పట్ల దళిత సమాజం సిగ్గు పడుతున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు.

ఇటీవల విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన జగన్ మోహన్ రెడ్డి పేరును కొందరు అంబేద్కరిస్టులు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ చిన్న సంఘటనను పురస్కరించుకుని వైసీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపి నందిగామ సురేష్, ఎమ్మెల్సీ మొండి తోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ ఫిర్యాదు చేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకు జగన్నన్న పేరు పెట్టుకున్నప్పుడు, రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం పై జరిగిన హత్యలు, దళిత మహిళలపై అత్యాచారాలపై ఏ ఒక్క రోజూ నోరు విప్పేందుకు మనసు రాని వైకాపా దళిత నాయకులు జగన్నన్న కోసం గుండెలు బాదు కోవటం అంబేద్కర్ ను అవమానించటమే అన్నారు. పాలకులకు ఇలాంటి ఊడిగం చేయటం వల్లనే ఇతర సామాజిక కులాల ముందు ఎస్సీ, ఎస్టీలు నగుబాటు అవుతున్నారని చెప్పారు.

ఒకవైపు దళితుల్లో ఐక్యతను, దాష్టీకాలపై ఎదిరించే చైతన్యాన్ని తెచ్చేందుకు మాలాంటి వాళ్ళు కృషి చేస్తుంటే, పదవుల కోసం నాయకులకు భజన చేయటం, డూడూ బసవన్నల్లా తలలు ఊపటం నీచమైన పనిగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకునే పనికి స్వస్తి పలికి, చేతనైతే దళితులకు సేవ చేయాలని, లేకపోతే రాజకీయాల నుంచి