మంత్రి లోకేష్‌ పనితీరు భేష్‌

– గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ

గుంటూరు, మహానాడు: యువనేత నారా లోకేష్ ఐటి మానవవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక విద్యారంగంలో సమూల మార్పులతో అంతఃకరణ శుద్దితో పనిచేస్తూ జిల్లా మంత్రిగా గుంటూరులో జాతీయ జెండా ఆవిస్కహరణ గౌరవవందనం స్వీకరణ ఎంతో గర్వకారణంగా ఉందని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.

78వ స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా మంత్రిగా జెండా వందనం చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంటూరు పోలీస్ ప్యారేడ్ గ్రౌండ్ కు జెండావందనం కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కి పుష్పగుచ్చంతో సాయి కృష్ణ స్వాగతం పలికారు.

ఎన్నికల హామీలయిన సూపర్ 6 తో పాటు అధికారం వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలైన మెగా డీఎస్సీ తో పాటు అయిదు ఫైళ్ల పైన సంతకాలు చేయించే బాధ్యత తీసుకోవటమే గాక రాష్ట్రంలో ఐటి విప్లవానికి నాంది పలికి, 20 లక్షల ఉద్యోగాల కల్పనకు బాధ్యత తీసుకుని మరోపక్క విద్యాశాఖ మంత్రిగా తన శాఖల్లో పూర్తి అధ్యనం చేస్తూ విద్యావ్యవస్థలో సమూల మార్పులకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారని ప్రశంసించారు.