కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆఫీసులో స్వాతంత్య్ర వేడుకలు

గుంటూరు, మహానాడు: గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సీనియర్ వైద్యుడు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆవిష్కరణ అనంతరం గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఫలితంగా దేశ స్వాతంత్య్ర లభించిందన్నారు. ప్రజాభివృద్ధి, సంక్షేమం కోసం గుంటూరులో పెమ్మసాని, రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని, వారి కృషి ఫలితంగా మరింత అభివృద్ధి త్వరలోనే చూడగలమని ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ప్రజలు, కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు.