- ఐదేళ్ల వైసీపీ హయాంలో ప్రతినిత్యం తమ గిరిజనుల పొలాలలో, సర్వేపల్లి రిజర్వాయర్ లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టింది వైసీపీ నాయకులే
- ఆనాడు ఏమయ్యాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. చెక్కభజన ఏమైనా చేస్తున్నాడా గ్రావెల్ తవ్వకాలను ఎందుకు నిలుపుదల చేయలేదు
- గ్రావెల్ తవ్వకాలు చేపట్టింది వైసీపీ నాయకులైతే నిందలు మాత్రం మా పెద్దాయన సోమిరెడ్డి పైన.. ఇది ఎంతవరకు న్యాయం
- గిరిజనుల ఆపద్బాంధవుడు మా పెద్దాయన సోమిరెడ్డి
- వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీలో గురువారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులపై దుమ్మెత్తి పోసిన అనికేపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీ గిరిజనులు
గడిచిన మూడు నెలలుగా అనికేపల్లి పంచాయతీలో గిరిజన పొలాల్లో గ్రావెల్ తవ్వకాలు జరగలేదు. ఇదంతా వైసీపీ నాయకులే సృష్టించిన కట్టుకథ అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ నాయకుల మాటలను నమ్మే స్థితిలో లేరని అంటున్నారు.
తాజా ఘటనలో, అనికేపల్లి వైసీపీ నాయకులు తమ కుమార్తె మల్లిక సుభాషిణిని బెదిరించి, బలవంతంగా తీసుకెళ్లి, సోమిరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయించారు. గతంలో వైసీపీ నాయకులే తవ్వించిన గ్రావెల్ గుంటలను చూపించి, ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ, ఇక్కడ ప్రజలు అంత అమాయకులు కాదని స్థానికులు అంటున్నారు.
వైసీపీ నాయకుల తప్పుడు ఆరోపణలు మానుకొని, వాస్తవాలను అంగీకరించాలని సూచిస్తున్నారు. వైసీపీ నాయకుల దాహానికి గిరిజనులు తమ వ్యవసాయ భూములను కోల్పోయారని, గత ఐదేళ్లలో గిరిజనుల గోడు వైసీపీకి పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.
గ్రావెల్ గుంటలలో గోలగముడికి చెందిన మైనార్టీ యువకుడు, అనికేపల్లి గ్రామానికి చెందిన బీసీ యువకుడు, మరియు అనేక మూగజీవాలు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటనలకు వైసీపీ నాయకుల ధన దాహమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రోత్సాహంతో వైసీపీ నాయకుల గ్రావెల్ తవ్వకాల వల్ల అనేక గిరిజనులు నష్టపోయారు. వైసీపీ హయాంలో గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని అంటున్నారు. ఈగ మహేష్ చిత్రహింసలకు గురైనట్లు చెబుతూ, కోడూరు ప్రదీప్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు చేస్తున్నారు.
వైసీపీ నాయకుల తప్పుడు ఆరోపణలపై స్పందిస్తూ, తమ పెద్దాయన సోమిరెడ్డి మరియు కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆరోపణలను ఊరికే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.