– డీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్
షాద్ నగర్, మహానాడు: షాద్ నగర్ లో సునీత అనే మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులపై తొలి కేసు నమోదైంది. సస్పెన్షన్ లో ఉన్న షాద్ నగర్ డీఐ రాంరెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు సునీత ఈ నెల 11వ తేదీన ఫిర్యాదు చేయగా ఈ మేరకు కేసు నమోదైంది.
ఓ దొంగతనం కేసులో సునీతను పోలీస్ స్టేషన్ కు పిలిపించి తీవ్రంగా కొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో ఏసీపీ రంగస్వామి ఘటనపై విచారణ జరిపారు. అనంతరం నివేదికను సైబరాబాద్ సీపీకి సమర్పించగా, నివేదిక ఆధారంగా డీఐతో పాటు ఉన్న కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.