- క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
- పేదలకు స్వయంగా వడ్డించిన ఎమ్మెల్యే, అధికారులు, నాయకులు
- క్యాంటీన్ నిర్వహణకు ప్రజల విరాళాలు
రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభంలో భాగంగా… కందుకూరులో అన్న క్యాంటీన్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభమైంది. ముందుగా క్యాంటీన్ సమీపంలోని రావిచెట్టుకు పూజలు చేయడం, స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం, నూతన శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమాల అనంతరం క్యాంటీన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయనతోపాటు మున్సిపల్ కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి, టిడిపి నాయకులు కలిసి పేదలకు స్వయంగా పదార్థాలు వడ్డించడమే కాక తాము కూడా రుచి చూశారు. ప్రారంభోత్సవం రోజున మూడుపూటలకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలియజేశారు.
అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేవలం 5 రూపాయలతో మూడుపూటలా పేదవాడి కడుపు నింపాలన్న చంద్రబాబు ఆలోచన చాలా గొప్పదన్నారు. గత ప్రభుత్వంలో జగన్ దుర్మార్గంతో క్యాంటీన్లను మూసివేసి పేదల పొట్ట కొట్టారని విమర్శించారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు హామీ ఇచ్చారని, దాని నిలబెట్టుకుంటూ ఇంకా ముందుగానే క్యాంటీన్లను మొదలు పెట్టారని ఎమ్మెల్యే అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మీద క్యాంటీన్లు ఏర్పాటు చేయటం ఆయనను ఘనంగా స్మరించుకోవడమేనని చెప్పారు.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో, కందుకూరులో ప్రతిపూట 500 మందికి పైగా పేదలు కడుపునిండా భోంచేసేవారని, ఇప్పుడు కూడా అదే రుచి, శుచితో క్యాంటీన్ నిర్వహణ ఉంటుందని హామీ ఇచ్చారు. ఇకనుంచి తాను స్వయంగా క్యాంటీన్ పై పర్యవేక్షణ చేస్తానని తెలిపారు. చుట్టుపక్కల ఎక్కువగా ఉండే కూలీలు, చిరువ్యాపారులు, చిరుద్యోగులకు క్యాంటీన్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అన్న క్యాంటీన్ నిర్వహణ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బ్యాంక్ అకౌంట్ కు ఎవరైనా విరాళాలు పంపవచ్చని ఎమ్మెల్యే సూచించారు. పుట్టినరోజు, ఇతర ఫంక్షన్ ల రోజున వారి వారి పేర్ల మీద విరాళాలు అందించి పేదలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ప్రజలు, వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ చెత్తవేయొద్దని, స్వచ్ఛ కందుకూరు కోసం సహకరించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. పట్టణంలో 100 శాతం వీధిలైట్లు వెలిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గుణ్ణంకట్ట, పోస్టాఫీస్ ప్రాంతాలలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు కోరగా, అవసరమైన చోట మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
అన్నక్యాంటీన్ కు దాతల విరాళాలు
ఎమ్మెల్యే పిలుపుతో, మొదటిరోజే పలువురు దాతలు అన్నక్యాంటీన్ల నిర్వహణకు విరాళాల రూపంలో 2,29,635 రూపాయలు అందించారు.
కందుకూరు పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు, సూర్యబార్ అధినేత పిడికిటి వెంకటేశ్వర్లు 55,555 రూపాయలు, వరసిద్ధి వినాయక ఫైర్ వర్క్స్ యజమాని తానికొండ ప్రవీణ్ 50 వేలు, సత్యసాయి జువెలరీస్ యజమాని కాకుమాని ప్రవీణ్ 25 వేలు, లింగసముద్రం మండలం యర్రారెడ్డిపాలెం గ్రామ టిడిపి నాయకుడు రాజవరపు మాలకొండయ్య 25,116 రూపాయలు, కందుకూరుకు చెందిన కొత్త వెంకటేశ్వర్లు 10,116 రూపాయలు, లైఫ్ స్టైల్ అధినేత కొత్తూరు వెంకట సుధాకర్ 10,116 రూపాయలు, గుర్రం వెంకటేశ్వర్లు 10 వేలు, సుదర్శి శ్యాంప్రసాద్ 10 వేలు, షేక్ నజీర్ బాషా 10 వేలు, మోదడుగు లక్ష్మణ కుమార్ 5,116 రూపాయలు, చాకిచెర్ల గ్రామ పార్టీ అధ్యక్షుడు మిరియం మల్లికార్జున 5,500 రూపాయలు, ముచ్చు రామకోటయ్య 5,116 రూపాయలు, చల్లా చెంచురామయ్య తరపున ఆయన కుమార్తె మీనాక్షి 5 వేలు రూపాయలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఇంకా కంసాని మయూరి, అనంత రాగయ్య, తుమ్మల వేణుమాధవలు వెయ్యి రూపాయలు చొప్పున విరాళంగా అందజేశారు. వీరందరినీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి, కందుకూరు పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, జనిగర్ల నాగరాజు మాదాల లక్ష్మీనరసింహం వేముల గోపాలరావు, పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, నియోజవర్గ బిజెపి ఇంచార్జ్ ఘట్టమనేని హరిబాబు, జనసేన నాయకులు మదన్, టిడిపి నాయకులు ఉన్నం వీరాస్వామి, కండ్రా మాల్యాద్రి, చదలవాడ కొండయ్య, చిలకపాటి మధు, ముచ్చు శ్రీను, వడ్డేళ్ల రవిచంద్ర, షేక్ రఫీ, రెబ్బవరపు మాల్యాద్రి, రాయపాటి శ్రీనివాసరావు, షేక్ మున్నా, వార్డు అధ్యక్షుడు వడ్లమూడి చెంచు నారాయణ, షేక్ సలాం, సవిడిబోయిన వెంకటకృష్ణ, పులి నాగరాజు, ముచ్చు వేణు, కాంట్రాక్టర్ రావూరి రామకోటయ్య, అన్ని వార్డుల అధ్యక్షులు వివిధ కమిటీల్లో సభ్యులు పాల్గొన్నారు.