– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్
ఉయ్యూరు, మహానాడు: స్వాతంత్య్ర సమరయోధుడు, బలహీనవర్గాల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లచ్చన్న తన జీవితాంతం పేదలు బడుగు బలహీనర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి లచ్చన్న అని అన్నారు. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సాగించిన ప్రయాణం ఆయన్ను మహనీయునిగా నిలబెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కుటుంబరావు, గుత్తా చంటి, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, కౌన్సిలర్లు తెనాలి పద్మ, పరిమి సలోమి, కోరాడ వెంకట లక్ష్మీ, నాయకులు, జంపాన శ్రీనివాసరావు, వీరంకి చింతయ్య, పైడియ్య, అప్పల నాయుడు, గణేష్, నరసింహారావు, రామనోళ్ళ శ్రీకాంత్, సలీం తదితరులు పాల్గొన్నారు.