సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోమ్ మంత్రి అనిత

విశాఖపట్నం, మహానాడు: ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్ళి సింహాద్రి అప్పన్నను హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్న హోమ్ మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు లక్ష్మినరసింహస్వామి వారిని మెట్ల మార్గంలో వెళ్ళి దర్శించికోవడం అదృష్టంగా భావిస్తున్నాను. గత ప్రభుత్వంలో సింహాచలం మెట్లమార్గాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకుంటాం. అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.