త్వరలో తీర ప్రాంతాల్లో ఎగరనున్న సీ ప్లేన్స్

– ఏపీ కి కేంద్రం బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో త్వరలో సీ ప్లేన్స్ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ బంపర్ ఆఫర్
విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వెల్లడించారు. వచ్చే వారం రోజుల్లో సీ ప్లేన్స్ విధానాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఏపీలో తీర ప్రాంతం అధికంగా ఉన్న నేపథ్యంలో పర్యాటకంగా ఈ సీ ప్లేన్స్‌ను ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.