అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ సాక్షి

– గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్‌, మహానాడు: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఆత్మీయత, అనురాగానికి నిలువెత్తు సాక్ష్యం రక్షాబంధన్ అని.. సోదర భావానికి సాక్షాత్కారం రాఖీ అన్నారు. సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ మహిళా కార్యకర్తలు గవర్నర్ కి రాఖీ కట్టారు. రాజ్ భవన్ లో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలతో రక్షాబంధన్ కార్యక్రమాన్ని పంచుకున్నారు. మంగళ హారతులు ఇచ్చి రాఖీ కట్టి మిఠాయి పంచారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన తొలినాళ్లలోనే ఇంతటి ఆత్మీయత కనబరచడం అద్భుతమని.. దుర్గా వాహిని, మాత్రుశక్తి కార్యకర్తలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఆత్మీయతను, సోదర భావాన్ని పెంపొందించే ఏకైక పండుగ రక్షాబంధన్ అని అభిప్రాయపడ్డారు. తాను మహిళ సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని గవర్నర్ పేర్కొన్నారు. అంతకుముందు శాలువాతో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాంసింగ్, డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, మాతృ శక్తి రాష్ట్ర ప్రముఖ్ పద్మశ్రీ, దుర్గా వాహిని రాష్ట్ర ప్రముఖ్ వాణి సక్కుబాయి, సహ ప్రముఖ్ సింధుజ, మహానగర ప్రముఖ్ శిరీష, ధర్మ ప్రసార్ ప్రాంత సహ ప్రముఖ్ సుభాష్ చందర్ పాల్గొన్నారు.