తిరుపతి, మహానాడు: తిరుపతి జిల్లా శ్రీసిటీ, నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం 6.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన వీడ్కోలు లభించింది.
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డీఐజీ షిమోషి బాజ్ పాయ్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సల్, డీఆర్వో పెంచల కిషోర్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ , తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.