– ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, మహానాడు: రాఖీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ కోకాపేట్ లోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తనపై అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక అని, ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల శ్రేయస్సు, భద్రత కోసం తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని హరీష్ రావు అన్నారు.