– ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, మహానాడు: అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ చేయమని తాను ముందు నుంచి చెబుతున్నానని, అయితే కంపెనీలు వెనక్కు వెళతాయయోనని ఆందోళన చెందుతున్నారన్నారు. కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రలన్నింటినీ తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్న పవన్ కల్యాణ్, ఇందుకు కంపెనీల యాజమాన్యం కూడా సమహకరించాలన్నారు. భద్రతా ప్రమాణాలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కాలుష్య నివారణ తనిఖీలకు కంపెనీలు ముందుకు రావాలన్నారు. నెలాఖరులా విశాఖకు వెళతానని, కాలుష్య నివారణ, సేఫ్టీ ఆడిట్ పై దృష్టి పెడతానని తెలిపారు. మూడు నెలల్లో దీనిపై కార్యాచరణను ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.