– కొమ్మాలపాటి
పల్నాడు, మహానాడు: గ్రామసభల్లో ప్రజానీకం గళమెత్తుతోందని, అయిదేళ్ళుగా మూగబోయిన ప్రజల గొంతుకకు ఎన్డీయే ప్రభుత్వంలో స్వేచ్ఛ లభించదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏమి కావాలన్నా రాజకీయ నాయకులను అడగలేక ఇబ్బంది పడ్డ మహిళలు.. తమ గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకు వచ్చిన యువత… మహిళల అవసరాల కోసం ముందుకొచ్చి మాట్లాడిన ఆడపడుచులు.. ఇన్నాళ్లకు తమకి ఏం కావాలో అడిగే ప్రభుత్వం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామీణ ప్రజలు.. అన్ని గ్రామాల నుండి కూటమి ప్రభుత్వం పై వెల్లువెత్తుతున్న అభినందనలు… కూటమి ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లివిరిసిన ఆనందం.. ఇన్నాళ్లకు తమ గ్రామంలో పండుగ వాతావరణం వచ్చిందని అంటున్న ప్రజలు అంటున్నారని తెలిపారు.