అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 27 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సమర్థవంతమైన పాలన సాగించేందుకు ప్రభుత్వం చాలా శాఖల్లో బదిలీలు చేపట్టింది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపాటు పలువురు ఉద్యోగులను సైతం బదిలీలు చేసింది. తాజాగా మున్సిపల్ శాఖలో బదిలీలు చేపట్టింది. మొత్తం 27 మంది మున్సిపల్ కమిషనర్లను తాజాగా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.