రాష్ట్ర పరువును, ఐపిఎస్ గౌరవాన్ని తీసి ముంబై నటి పై హిడింబి లా ప్రవర్తించిన ముగ్గురు ఐపిఎస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంలో ఆలస్యం, కాలాతీతం సరైనది కాదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుటికే ఈ దుర్మార్గమైన వ్యవహారంలో ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమే… ఐనా చర్యలు తీసుకుంటేనే చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ లో మార్పు వస్తుందన్నారు. సోషల్ మీడియా లో నటి పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజ్య హింసను కాపాడేందుకు కొందరు పనికిమాలిన ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మహిళలు బాదితురాలైన నటికి అండగా ఉండాలని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.