ఆ అమ్మాయిని గుట్టుగా ఇంటికి పంపించేశారు…

– ‘గుడ్లవల్లేరు’ ఘటనలో యాజమాన్యం తీరు

గుడ్లవల్లేరు, మహానాడు: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ సీక్రెట్ కెమెరా ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని గుట్టుచప్పుడు కాకుండా కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపించింది. గుడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాలు అమర్చి, యువతుల అభ్యంతరకర దృశ్యాలు రికార్డు చేయడానికి తోడ్పాటు అందించిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అమ్మాయిని కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించడంపై తోటి విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు విచారణ పూర్తికాకముందే…ఆ యువతిని ఘటనా స్థలం నుంచి తప్పించడంపై సహ విద్యార్థనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.