ఏపీలో మహిళలకు రక్షణ కరవు

– మాజీ మంత్రి రోజా ఆరోపణ

తిరుమల, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరవైందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ మేరకు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాలేజీ బాత్రూంల్లో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు.. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలి.. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం..
జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్ళు.

ముచ్చుమర్రిలో 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే న్యాయం చేయలేదు.. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం, హోంమంత్రి ఎందుకు వెళ్ళలేదు.. నేను ఏ పార్టీ మారడం లేదు.. పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలి.. 2014-19 మధ్యలో కూడా చాలా మంది పార్టీ మారారు.. పార్టీ మారడం వల్ల జగన్ కు, వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరు.