– ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
ఒంగోలు, మహానాడు: ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ లో శనివారం పర్యటించిన జనార్దన్.. స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేశారు. వర్షంలో కూడా పింఛన్లు పంపిణీ చేయడంలో లబ్ధిదారులు ఆనందపడ్డారు. ఈ సందర్భంగా జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 1న సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, లబ్ధిదారుల సంక్షేమం కోసం ఆలోచించే కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ఒంగోలు మేయర్ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరావు, ఒంగోలు నగర టీడీపీ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.