సీఎంగా చంద్రబాబు… రేపటికి 30 ఏళ్ళు!

– సంబరాలకు సిద్ధమైన నేతలు
– కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో బాబు ఫోటోలతో ఎగ్జిబిషన్ లు
– విజన్ ఉన్న నేత.. నవ్యాంధ్ర నిర్మాణ ప్రదాత
– బాబుతోనే ఏపీ పునర్నిర్మాణం సాధ్యం
– మచ్చలేని చంద్రుడిని పక్క రాష్టాలు అనుసరిస్తున్నాయి
– ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి ఆలపాటి, బుచ్చి రాంప్రసాద్

మంగళగిరి, మహానాడు: నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రేపటి(సెప్టెంబర్ 1)కి 30 ఏళ్ళు నిండుతున్నాయని ఆయన సేవలను కొనియాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్ర ప్రజలకు దొరకడం అదృష్టమని నేతలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వినర్ బుచ్చి రాంప్రసాద్ లు పేర్కొన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

తెలుగు జాతి గర్వించదగిన రోజు
1995సెప్టెంబర్ 1 యావత్ తెలుగు జాతి గర్వించదగిన రోజు… రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశంలో ప్రజాస్వామ్యం కాపాడటానికి సమాజాన్ని రక్షించడానికి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు అది. అనాటి నుండి ఈరోజుకు ఎన్నోకష్టాలు, నష్టాలు, అపోహలు అవరోధాలను ఎదుర్కొని అహర్నిశలు తెలుగు జాతి ఉన్నతి కోసం శ్రమించిన మహోన్నత నాయకుడు నారా చంద్రబాబు. ఆయన జీవితం తెరిచిన పుస్తకం… మచ్చలేని చంద్రుడు ఆయన. సమాజాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్ళాలి.. సమాజాభివృద్ధే తన లక్ష్యంగా జీవనం సాగించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు.

రాజకీయాల్లో అపరచాణిక్యుడిగా, అభివృద్ధిలో తిరుగులేని వ్యక్తిగా ఎందరో గొప్ప గొప్ప వ్యక్తుల ప్రశంసలు పొందారు చంద్రబాబు. బిల్ గేట్స్, బిల్ కింటన్ , సుందర్ పిచ్చయ్, చంద్రశేఖరన్ లాంటి వ్యక్తులు ప్రశంసించారంటే సమాజం పట్ల ఆయనకు ఉన్న ధ్యేయం, సమాజం అభివృద్ధి చెందాలని నిరంతరం తప్పించే ఆయన ఆలోచన విధానం, ఆయన ముందు చూపు నేటి తరానికి ఆదర్శమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

అధికారం ఉన్నా.. అధికారం లేకపోయిన ప్రజలతో మమేకైన ఒకే ఒక వ్యక్తి భారత దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక్కరే. తెలుగు జాతీ గర్వించే వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపడితే.. తెలుగు ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిన వ్యక్తి చంద్రబాబు. సుధీర్ఘకాలం ఒక మహిళ దేశ ప్రధానిగా ఉన్నా.. మహిళల గురించి ఆమె ఏం పట్టించుకున్నారో తెలియాదు కాని… మహిళాసాధికారత అనే పదానికి అర్థం పరామర్థం చెప్పిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే.

సంక్షేమ పథకాలతో సామాజిక మార్పు తీసుకు వచ్చిన అనితర సాధ్యుడు చంద్రబాబు. సమాజంలో సగభాగమైన బీసీలను గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీనే… బీసీలకు న్యాయం చేసింది టీడీపీ పార్టీనే.. ఎస్సీ, ఎస్టీల లాగే బీసీలకు కూడా సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషిన వ్యక్తి చంద్రబాబు. వాస్తవాలను మననం చేసుకోవాల్సిన అవసరం.

సమాజంలో ఏ వ్యక్తి ఎవరికోసం పాటుబడ్డారో గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. సామాజిక మార్పుకు సంకేతంగా దళితుల అభ్యున్నతికి తొలి అడుగు వేసిన వ్యక్తి చంద్రబాబు. దళితులు, మహిళలు, బీసీలు అన్నివర్గాలకు న్యాయం చేసిన మహనీయుడు చంద్రబాబు. వ్యవసాయ రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదే. నేడు రాజధానుల్లో మేలైన రాజధాని ఏదని చెప్పుకోవాంటే అందరూ హైదరాబాద్ నే చూపిస్తున్నారంటే ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. నాడు చంద్రబాబు విజనరీ థింకింగ్ వలనే సైబరాబాద్ సాధ్యం అయిందన్నారు.

బెదరని, భయపడని నేత చంద్రబాబు
చంద్రబాబు నాయుడు జీవితంలో 2019 ముందు రాజకీయాలు ఒక రకంగా 2019 తరువాత రాజకీయాలు మరొకక రకంగా ఉన్నాయి. చంద్రాబు నాయుడు చేయని తప్పుకు ఆయన్ను జైలుకు పంపారు. ఆయన ఇంటిపై దాడి చేశారు. హెరిటేజ్ పై కక్ష సాధింపుకు దిగారు. అయినా చంద్రబాబు నాయుడు భయపడలేదు. చంద్రబాబు అంటనే విజనరీ నాయకుడు, నిజాయతీ కలిగిన వ్యక్తి, హార్డ్ వర్కర్ ఈ మూడు అంశాలు ఒకే వ్యక్తిలో ఉండటం రాజకీయాల్లో అరుదు. జాతీయ రాజకీయాల్లో గొప్ప అవకాశాలు వచ్చినా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకోసం ఇక్కడే ఉన్నారని అశోక్ బాబు అన్నారు.

బాబు విజన్ తో 2022 అన్నప్పుడు అప్పుడు చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడ్డారు. చంద్రబాబుపై అనేక అక్రమ కేసులు పెట్టినా ఒక్కటి కూడా నిలబడలేదు. స్వపక్షం, విపక్షం నుండి వచ్చే ఇబ్బందులను ధీటుగా ఎదుర్కొన్న వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్న సమాజాభివృద్ధికోసమే తీసుకున్నారు. సహనానికి చంద్రబాబు నిలువుటద్దం. చంద్రబాబు అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక బ్రాండ్. ప్రజల కోసం పాటుపడిన చంద్రబాబు జీవిత అంశాలపై ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తున్నాం.

ఆత్మవిశ్వాసానికి మారుపేరు బాబు
ఒక ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం నారా చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు అందించారు. నాడు రామారావు రూ. 30 తో పింఛన్ ను స్టార్ట్ చేస్తే నేడు రూ. 4,000 లకు చంద్రబాబు తీసుకెళ్లారు. దాంట్లో చంద్రబాబు పెంచినదే రూ. 3,200 ఉంది. చంద్రబాబు సంక్షేమానికి ఎంత పెద్దపీట వేశారో ఇదే నిదర్శనమని బుచ్చిరాంప్రసాద్ అన్నారు. రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడితే.. చంద్రబాబు తెలుగు విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు.

ఆత్మవిశ్వాసంతో ఎంతో కష్టపడి నేడు అన్ని రంగాల్లో యువత ముందుకెళ్తున్నారు. విదేశాల్లో సైతం సత్తా చాటుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్య శిబిరాలు పెట్టి 19 లక్షల మందికి వైద్య సేవలు అందించాం. ప్రతిపక్షంలో కూడా సేవలు కొనసాగించాం. సేవంటే ఎన్టీఆర్, చంద్రబాబులే కనిపిస్తారు తప్పా ఇంకొకరు కనిపించరు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక బ్రహ్మణుల సంక్షేమానికి కృషి చేశారు. బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుబడిన పార్టీ టీడీపీ మాత్రమే.