అందిన కాడికి దోచుకుంటున్న మీరు డెకాయిట్

– ఇంకా కేసీఆర్ మీద ఏడవటం మీ చేతకాని తనానికి నిదర్శనం
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

“తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి,10 ఏండ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన కేసీఆర్ ను డెకాయిట్ అనడం ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనం. నిన్నటి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబరపడి, ఉత్తమ్ తనకు తాను ముఖ్యమంత్రి గా ఊహించుకొని రేవంత్ రెడ్డి లాగా బూతులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడా? లేక కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ని మించి కేసిఆర్ ని తిడితే ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నాడా?

ప్రజాపాలన పేరుతో ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చి.. దోపిడీ పాలన చేస్తున్న మీరు డెకాయిట్లు. ఉత్తమ్ మాటలు దొంగే దొంగ దొంగ అని అరిచనట్లు ఉన్నాయి. నీ శాఖ సివిల్ సప్లై లో అవినీతి చేసి,ఆ అవినీతిని మేము అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే సమాధానం చెప్పకుండా పారిపోయిన మీరు డెకాయిట్. అధికారంలోకి వచ్చి 10 నెలలైన ఇంకా పాలన మీద పట్టు లేదు..ప్రజల సమస్యలు గాలికి వదిలి అందిన కాడికి దోచుకుంటున్న మీరు డెకాయిట్.చివరికి గురుకులాల్లో పిల్లల నోటికాడి ముద్దను కూడా లాక్కోని మింగుతున్న మీ కాంగ్రెస్ నాయకులు డెకాయిట్లు. అధికారం మారిన 10 నెలల తర్వాత కూడా పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఇంకా కేసీఆర్ మీద ఏడవటం మీ చేతకాని తనానికి నిదర్శనం

ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చకుండ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నారు.ప్రజలు అన్ని గమనిస్తున్నారు.రాబోయే కాలంలో మీకు ప్రజలే బుద్ది చెబుతారు. కేసీఆర్ పై మీరెన్ని మాట్లాడిన ఆకాశం మీద ఉమ్మేసినట్టే”