గొడ్డు కారంతో పెడుతున్నారు
పాములు కరిచి చనిపోతున్నారు
ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలవుతున్నారు
జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదు
రంగారెడ్డి జిల్లా, పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
పాలమాకుల: ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదు. చీమ కుట్టినట్లు అయినా మీకు లేదు. సిగ్గుచేటు. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి. ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది గురుకులాల్లో జాయిన్ చేస్తే ఏం చేస్తున్నారు?
రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. నువ్వు పూర్తిగా విఫలం అయ్యావు. పిల్లలు రోడ్డు మీదకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంటే బాధ తెల్సుకోవాలని వచ్చాను. దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నారు. భయంతో వణికిపోతున్నారు. కర్రలు విరిగేలా కొడుతున్నారని ఏడుస్తున్నారు. అన్నంలో, పప్పులో పురుగులు అంటే తినేసి తినండి అంటున్నారు అని బాధపడుతున్నారు. ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు. రెండో జత ఇవ్వలేదు అంటున్నారు. పుస్తకాలు కూడా ఇవ్వని పరిస్థితి.
కేసీఆర్ సన్నబియ్యం తో అన్నం పెడితే మీరు గొడ్డు కారంతో పెడుతున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం. 500 మంది ఆసుపత్రుల పాలయ్యారు. 38 మంది చనిపోయారు పాములు కరిచి చనిపోతున్నారు. ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఒకప్పుడు గురుకులాల్లో చదవటం కల. ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు.
కించపరిచేలా మాట్లాడటం సరికాదు. ఇక్కడ ఉన్న టీచర్లను మార్చండి. మంచి భోజనం పెట్టండి అని డిమాండ్ చేస్తున్నం. ముఖ్యమంత్రి విద్యా శాఖా మంత్రి గా ఉన్నారు. మైనార్టీ గురుకులాలు జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదు.అన్ని గురుకులాల్లో కాస్మొటిక్ చార్జెస్, కరెంటు బిల్లులు, మెస్ బిల్లులు రావడం లేదు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి తక్షణం చర్యలు తీసుకోండి.
సన్న బియ్యం కాదు పురుగుల అన్నం పెడుతున్నరు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోండి. మా నెంబర్ కూడా పిల్లలకి ఇచ్చాం. వారు భయపడి పోతున్నారు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు.
గురుకులాలను గాలికి వదిలేశారు: మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
గురుకులాలను గాలికి వదిలేశారు. విద్యా శాఖను పట్టించుకోవడం లేదు. ఎవరు ఏం అడిగిన పట్టించుకునే వారు లేరు. సీఎం గారు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదు? అసెంబ్లీలో అడిగినా సమాధానం లేదు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి.