విశాఖపట్నం, మహానాడు: సముద్రంలో వేటకు వెళ్ళిన చిన్నగంజాం మత్స్యకారులు తప్పిపోయారు. చెన్నై నుండి విశాఖపట్నంకు చేపల వేటకు బోట్లో మత్స్యకారులు వెళ్ళారు. విశాఖపట్నం సముద్ర తీరంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే ఏలూరి వారిని రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హోంమంత్రి అనిత, రెవెన్యూ అనగాని, కలెక్టర్ వెంకట మురళీ దృష్టికి సమస్య తీసుకువెళ్ళారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై కాపాడేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఎమ్మెల్యే ఏలూరి సెంట్రల్ కమాండ్ ను అప్రమత్తం చేశారు. కోస్ట్ గార్డ్స్ విశాఖ సముద్ర తీరంలో గాలింపు చర్యలు చేపట్టారు.