జగనాసురుడిపై ‘బెంగళూరు టీడీపీ’ పోరాటం అనిర్వచనీయం

– మంత్రి సవిత

* బెంగళూరు, మహానాడు: జగనాసురుడిపై బెంగళూరు టీడీపీ ఫోరం చేసిన పోరాటం అనిర్వచనీయమని, బెంగళూరు టీడీపీ ఫోరం రాజకీయాలే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అభినందించారు. బెంగళూరులో ఆదివారం బెంగళూరు టీడీపీ ఫోరం నిర్వహించిన ‘నవశకం-మంచిరోజులు వచ్చాయి’ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే… ఎన్నికల్లో బీసీ బిడ్డయిన తన వెనక బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు నిలబడ్డారు. స్వచ్ఛందంగా వారంతా నా తరఫున ఎన్నికల్లో పనిచేసినందుకు ధన్యవాదాలు. గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. దోచుకోవడం…దాచుకోవడమే లక్ష్యం జగన్ పాలించారు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు వేసి వేధించారు…జైల్లో పెట్టారు. ప్రజలు సైతం భయం భయంతో కాలం గడిపారు. మద్యం, మైనింగ్, భూ కబ్జాల దందాలు చేశారు. ప్రజల ఆస్తులను సైతం కొట్టేయడానికి చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్డు చట్టం తీసుకొచ్చారు. రాక్షస పాలనను భరించలేక…ప్రజలంతా మూకుమ్మడిగా చంద్రబాబు ఓటేసి గెలిపించుకున్నారు. ప్రజలపై తను ఉంచి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెన్షన్లను పెంచి అందజేశారు.

పేదోడికి మూడు పూటలా కడపునింపడానికి అన్న క్యాంటీన్లు పెట్టారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమను జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యశం చేశాడు. 2014లో నేతన్నలకు చంద్రబాబు అమలు చేసిన పథకాలన్నింటినీ రద్దు చేశారు జగన్. ఇపుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు…చేనేతకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. వారానికి ఒక్కసారైనా ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చిన మంత్రి సవిత.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, అలిమినేని సురేంద్రబాబు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నాయకులు డాక్టర్ సురేశ్, రావి రామ్మోహన్ చౌదరి, బి. గోపాల్, బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు, చెన్నై టీడీపీ ఫోరమ్ సభ్యులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.