ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టండి

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ, మహానాడు: భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యలపై అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. వరద నష్టం, సత్వర సహాయక చర్యలపై ఆదివారం హైదరరాబాద్‌ నుంచి అధికారులతో ఆయన సమీక్షించారు. వ్యవసాయం, రెవెన్యూ, పంచాయతీరాజ్, జలవనరులు, విద్యుత్, పోలీస్‌ సహా పలు శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు. రైతులకు పంటనష్టం విషయంలో వేగంగా స్పందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ వ్యవసాయ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల్లో సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరీ ముఖ్యంగా మంచినీరు, పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.