ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

– ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
– అధికారులతో పాటు ఇర్రిపాక ఏలేరు నది తీరాన వాటర్ అవుట్ ఫ్లో ప్రతిక్షణం పరిశీలన

జగ్గంపేట: అధిక వర్షాలతో ఏలేరు నది నిండు కుండ మారడంతో ఏలేరు నదిలో నీటిని విడుదల చేయడం జరిగింది. 8వ తేదీ ఆదివారం అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులతో కలిసి, ఎప్పటికప్పుడు నీటి ఉధృతిని పర్యవేక్షించారు ఇర్రిపాక గ్రామంలోకి నీరు రాకుండా జెసిబి లతో గట్లు వేయించారు.. తొమ్మిదో తేదీ ఉదయం జగ్గంపేట ఎమ్మార్వో, ఎంపీడీవో, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ తో కలిసి అక్కడే ఉండి ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాల పరిస్థితి సమీక్షిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. నిన్నటి నుండి కిందకు ఏలేరు నది నుండి నీటిని వదలడం జరుగుతుందని 1500 క్యూసెక్కులతో ప్రారంభమైన అవుట్ ఫ్లో 20000 క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని రిజర్వాయర్ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని చెప్పారు.

మధ్యాహ్నం కి 20వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో నీటిని అధికంగా విడుదల చేయడం జరుగుతుందని, దీనివల్ల ఏలేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న సోమవారం, కృష్ణవరం, ఎస్ తిమ్మాపురం, శృంగారాయుని పాలెం, రాజుపాలెం, రామకృష్ణాపురం, వీరవరం తదితర గ్రామాల ప్రజలు దిగు ప్రాంతంలో ఉన్న వారందరూ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు.

ఏలేరు రిజర్వాయర్ సామర్ధ్యాన్ని మించి ప్రవాహం వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాం. పునరావాస కేంద్రాలను కూడా రెడీ చేస్తున్నామని హైస్కూల్ అని సిద్ధం చేశాం అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకొని ముందుగానే ముంపు ప్రాంతంలో ఉన్న వారిని. సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఉండాలని అధికారుల ఆదేశించాం అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.