లలితా జ్యువెలిరీ అధినేత వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం

లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎం.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం కలిసి ఈ చెక్కు అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ని సీఎం చంద్రబాబు అభినందించారు.