– కొమ్మాలపాటి
నరసరావుపేట, మహానాడు: ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి, నాటి సీఎం జగన్.. పైశాచిక ఆనందాన్ని పొందారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ విమర్శించారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం దిశగా పాలన సాగించారు కాబట్టే, ఆయన్ని అరెస్టు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు రోడ్లపైకి రావడమే కాకుండా, ప్రపంచం లోని సుమారు 70 దేశాల లోని ప్రజలు సంఘీభావం తెలిపారన్నారు. నేర ఘటనలో చంద్రబాబు నాయుడు కి ప్రమేయమున్నట్టు ఎక్కడా కనిపించలేదని హైకోర్టు వ్యాఖ్యానించడం ఇక్కడ గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ అవినీతి, అరాచక, అక్రమ అరెస్టుల వలనే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.