గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే మాధవి

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమలో గణనాథులను దర్శించుకొని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూజలు చేశారు. వినాయక మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు నియోజకవర్గంలోని శ్రీనివాసరావు పేట 6, 9వ లైన్ అచ్చయ డాబా సెంటర్, ఏటి అగ్రహారం 10&12వ లైన్, నల్లకుంట 6వ లైన్, మారుతీ నగర్ మెయిన్ రోడ్డు, సాయిబాబా రోడ్డు నార్నే టవర్స్, కొరిటిపాడు మెయిన్ రోడ్డు, అరండల్ పేట 18వ లైన్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ తోపాటు పలు డివిజన్ లలో మండపాలను ఎమ్మెల్యే సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్తంభాల గరువు మెయిన్ రోడ్డు వద్ద వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.