పడవల వెనుక ఉన్న పెద్దలు దేశద్రోహులే…

– డేగల ప్రభాకర్

గుంటూరు, మహానాడు: భయంకరమైన కరువు వలసలను నివారించి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో సాగు తాగునీరు అందించాలన్న సదుద్దేశంతో ప్రకాశం బ్యారేజీ నిర్మించారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు.

మంగళవారం అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు లక్షలాదిమంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఈ ప్రాజెక్టును ధ్వంసం చేయడానికి కుట్ర చేసిన వారిని దేశద్రోహులు కాక ఇంకేంమానాలి అని మండిపడ్డారు. గుంటనక్కలు ఏ విధంగా అవకాశం కోసం వేచి చూస్తాయో అదేవిధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.సెప్టెంబర్ 2న ప్రకాశం బ్యారేజీ కి వరద వచ్చిన సమయంలో 5 భారీ పడవలను బ్యారేజీ మీదకు వదిలి నాశనం చేసేందుకు వైసిపి కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ కేసులో నిందితుల ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు.