చంద్రబాబు చర్యలు ఆదర్శనీయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
– పారిశుద్ధ్య కార్మికులకు బీజేపీ సన్మానం

విజయవాడ: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ..విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత పదిరోజులుగా విజయవాడలో ఎక్కువ భాగం ముంపులోనే ఉంది. ఇప్పటికే కొంత నీరు నివాసాల మధ్యలోనే ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు కలెక్టర్ ఆఫీస్ లోనే ఉంటూ.. పర్యవేక్షణ చేస్తూ తీసుకున్న చర్యలు ఆదర్శనీయం. ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యతలు తీసుకుని పని చేసిన చంద్రబాబుకి బీజేపీ పక్షాన అభినందనలు చెబుతున్నాం. క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పరిశీలించి వరద బాధితులకు అండగా ప్రభుత్వం నిలిచింది. వరద అనంతర చర్యలు కూడా వేగంగా జరగడం గొప్ప విషయం.

వేలాది మంది పారిశుద్ద్య కార్మికులను రంగంలోకి దించి.. ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ విపత్తులో కీలక పాత్ర పోషించిన కొంతమంది పారిశుద్ద్య కార్మికులను, బీజేపీ పక్షాన సన్మానించి.. ధన్యవాదాలు చెబుతున్నాం. ఈ వరదల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు అందరూ బాగా పని చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం, బీజేపీ రాష్ట్ర కార్యాలయ ప్రతినిధి భాస్కర్, బిజెపి NTR జిల్లా ప్రధాన కార్యదర్శులు కోలపల్లి గణేష్, భోగవల్లి శ్రీధర్, మాదాల రమేష్,బిజెపి NTR జిల్లా మహిళా నాయకులు ఎర్ర సునీత, బొమ్మదేవర రత్న కుమారి, శాంతి, చిగురుపాటి లక్ష్మి, బిజెపి మైలవరం నియోజకవర్గం కన్వినర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, బిజెపి జిల్లా కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు.