ఘోర బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

– మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా

అమరావతి: చిత్తూరు జిల్లా మొగ‌లి ఘాట్ వ‌ద్ద జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో 7 గురు మృతి చెంద‌డంపై సీఎం చంద్ర‌బాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బెంగుళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీ నీ ఢీకొన్న ఘటనలో, 7 గురు ప్రాణాలు కోల్పోగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం….సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాల‌ను ప్రభుత్వం ఆదుకుంటుందని అని తెలిపారు.

శుక్రవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన లో మృతి చెందిన కుటుంబాలకు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ను ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.