వయోవృద్ధుల సంక్షేమానికి ‘పెద్దకొడుకు మోదీ’ ఆపన్న హస్తం

– 70 ఏళ్లు దాటిన అన్నివర్గాల వారందరికీ రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా
– పేద, ధనిక తేడాలేకుండా
– 6కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి
– ఈ పథకంపై వచ్చే రెండేళ్లలో రూ.3,437 కోట్లు ఖర్చుచేయనున్న కేంద్రం
– తెలంగాణ నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి
– తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగిన లబ్ధిదారుల సంఖ్య
– 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులందరికీ,ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు
– ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న కుటుంబాల్లోని 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ.5లక్షల టాప్-అప్ కవర్
– కేంద్రం నిర్ణయంతో వయోవృద్ధుల్లో హర్షం
– వయోవృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నప్రధానమంత్రికి ధన్యవాదాలు
– కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి

వృద్ధుల సంక్షేమానికి గొప్ప ఉపశమనం కల్పిస్తూ,ఓ కుటుంబ పెద్దగా, ఓ పెద్దకొడుకుగా నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం యావద్భారతం మన్ననలను అందుకుంటోంది. దీంతో కోట్లాది వృద్ధులు మోదీని ఆశీర్వదిస్తున్నారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) పథకాన్ని అప్‌డేట్ చేసి.. 70 ఏళ్లు దాటిన అన్నివర్గాల వయోవృద్ధులందరికీ రూ.5లక్షల వరకు వైద్య బీమా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యంగా వృద్ధుల్లో వయసు పెరిగేకొద్దీ తరచుగా అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో అనేక కారణాలతో వృద్ధులకు సరైన చికిత్స పొందలేరు. అలాంటి సమయంలో ఈ పథకం కింద ప్రభుత్వం ఎంపికచేసిన అన్ని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని పొందవచ్చు.

కొన్ని వ్యాధుల చికిత్స చాలా ఖరీదైనదిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పథకం ఎంతో మేలు చేస్తుంది. పెద్ద, లేక చిన్న వ్యాధి వచ్చినా ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఈ పథకం ద్వారా కల్పించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. దేశ సమగ్రాభివృద్ధిలో వయోవృద్ధుల సంక్షేమానికి సరైన ప్రాధాన్యతను కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయం అనడంలో సందేహం లేదు.

ఇప్పటికే దేశంలో యువత, మహిళలు, పేదలు, రైతుల సాధికారతకు ఓ పెద్దన్నలా అండగా నిలుస్తున్న ప్రధాని మోదీ తాజాగా వయోవృద్ధులకు పెద్దకొడుకుగా వారి సంక్షేమం కోసం కీలక ముందడుగు వేశారు.

ప్రస్తుత ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB PMJAY) పథకంలో అర్హత కలిగిన కుటుంబాలు 12 కోట్లు ఉండగా.. ఈ కుటుంబాల్లోని 45.83 కోట్ల మంది లబ్ధిదారులు ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ దాదాపు 30 లక్షల కుటుంబాలు, ఇందులోని దాదాపు 1.15 కోట్ల మంది ప్రజలు ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. జూలై 2024 వరకున్న లెక్కల ప్రకారం.. తెలంగాణలో 17.2 లక్షల ట్రీట్‌మెంట్లకు రూ.3,626 కోట్ల విలువైన వైద్యసేవలు లబ్ధిదారులు PMJAY పథకంలో భాగంగా పొందారు.

అయితే.. ఇన్నాళ్లుగా ఈ పథకం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి (BPL) మాత్రమే వర్తిస్తోంది. ఈ పథానికి పలు మార్పులు చేసి.. కుల, మత, ప్రాంత, పేద, ధనిక అనే తేడాల్లేకుండా వయోవృద్ధులు అందరికీ వర్తింపజేయాలని భావించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లందరూ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ.5 లక్షల వరకు కవరేజీ పొందనున్నారు.

తాజాగా తీసుకొచ్చిన మార్పులతో లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరగనుంది. కాగా, ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న కుటుంబాల్లోని 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ.5లక్షల టాప్-అప్ కవర్ అందించనున్నారు.

అందరు అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డును ఈ పథకంలో భాగంగా అందిస్తారు. ఇందుకోసం వచ్చే రెండేళ్లలో రూ.3,437 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చుచేయనుంది. పథకం పరిధిని విస్తరించడంతో.. 70 ఏళ్లు, పైబడిన 6 కోట్ల మంది (4.5 కోట్ల కుటుంబాలు) లబ్ధిదారులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందనున్నారు. పథకానికి మార్పులు చేయడం ద్వారా.. 2.72 కోట్ల లబ్ధిదారులు (1.96 కోట్ల కుటుంబాలు) అదనంగా ప్రయోజనాలు పొందేందుకు అర్హత పొందారు. ఇందులో తెలంగాణ నుంచి దాదాపు 10 లక్షల మంది లబ్ధిపొందనున్నారు.

వృద్ధ్యాప్యంలో విశ్వాసం

ఈ పథకం సీనియర్ సిటిజన్స్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. కుటుంబ బాధ్యతల నేపథ్యంలో.. సొంత కొడుకులు, కూతుళ్లు ఉపాధి కోసం.. తల్లిదండ్రులను వదిలి దూరంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు, వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. కుటుంబ పెద్దలు, వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ కొరకు నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా పెద్దల్లో ఆత్మవిశ్వాసం నింపి వారికి ఆర్థికంగా అండగా, మానసికంగా మరింత ధైర్యాన్నిస్తుంది. అంతేకాకుండా సొంత కుటుంబసభ్యుల ద్వారా నిర్లక్ష్యానికి గురవుతున్న సీనియర్ సిటిజన్స్‌కు మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్లయింది.

మోదీ ప్రభుత్వం తెచ్చిన AB PMJAY తమ ఆరోగ్య సంరక్షణకు భరోసానిస్తే, ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన (PMBJP) కేంద్రాల ద్వారా 90% వరకు డిస్కౌంట్‌తో అతితక్కువ ధరలకు మందులను పొందుతూ.. ఎవరిపైనా ఆధారపడకుండా మరింత నిశ్చింతగా జీవనం సాగించవచ్చని వయోవృద్దుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

మరోవైపు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కిలోల వరకు ఆహార ధాన్యాలు అందిస్తుండడం తమ జీవితాలకు మోదీ ఇచ్చిన గ్యారంటీ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని 70 ఏళ్లు, ఆ పైబడిన వయసు కలిగిన సీనియర్‌ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసినందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ సిటిజన్ల తరపున కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.