పెదకూరపాడు, మహానాడు: పట్టణంలో నూతనంగా నిర్మించనున్న ఉప ఖజానా(సబ్ ట్రెజరీ) కార్యాలయ పనులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు. కోటి ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉప ఖజానా కార్యాలయ నూతన భవనాన్ని నిర్మించనున్నారు. ఈ భవనానికి ఎమ్మెల్యే… అధికారులు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. వచ్చే మార్చి నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.