– మంత్రి లోకేష్
అమరావతి, మహానాడు: గత అయిదేళ్ళలో జగన్ సర్కారు నిర్వీర్యం చేసిన ఉన్నత విద్య రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం, కుప్పం ద్రవిడ యూనివర్శిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదలైంది. జీతాల విషయాన్ని అక్కడి ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు రూ. 2.86 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చాం. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.